సమంతకు నేను ట్రై చేసేవాడిని!

Sai-Dharam-Tej-Favourite-heroine-samantha-ruth-Prabhuస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా…. హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని ఓ బెటాలియన్ తో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సాగించిన ముచ్చట్లు వీక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పలువురు మహిళా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సాయి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని, చాలా బాగుంటుందని, సమంతకు నాగచైతన్య ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని చమత్కరించడంతో, అక్కడున్న మహిళా పోలీసులందరూ ఒక్కసారిగా నవ్వేసారు.

తనకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని చెప్పిన సాయిధరమ్ తనకు నచ్చిన హీరోల గురించి కూడా చెప్పాడు. తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అన్న సాయి, రవితేజ ఎనర్జీ లెవెల్స్ తనకు బాగా ఇష్టమని, మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే రవితేజతో కలిసి నటించేందుకు తాను మొగ్గు చూపుతానని అన్నాడు. ఈ సందర్భంగా తన మొదటి హీరోయిన్ రెజీనా గురించి ప్రస్తావిస్తూ… తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, అంతే తప్ప ఇంకేం లేదని అన్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories