సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తాజా చిత్రం సోలో బ్రాతుకే సో బెటర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం మే 1 న విడుదల కావాల్సి ఉంది, కానీ మార్చి చివరి వారంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ హీరో తెరపై బ్యాచిలర్ హుడ్ ను సమర్థిస్తున్నప్పటికీ, నిజ జీవితంలో మాత్రం పెళ్లికి సిద్ధం అవుతున్నాడట.
ఇటీవలే 33 ఏళ్లు నిండిన ఈ నటుడు తన తల్లికి 34 ఏళ్ళు పూర్తయ్యే లోపే పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినట్లు సమాచారం. అంటే ఒక సంవత్సరంలోపు అతను ఒక ఇంటి వాడు అవుతాడు. అతను ఇప్పటికే ఒక అమ్మాయిని చూస్తున్నాడని పుకార్లు ఉన్నాయి. మరో వైపు… సోలో బ్రతుకే సో బెటర్ తరువాత, సాయి ధరం తేజ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ కోసం దేవ కట్టాతో జతకట్టనున్నారు.
సాయి ధరం తేజ్ అర డజను ఫ్లాప్‌ల తరువాత ప్రతీ రోజు పండగే తో తిరిగి ఫామ్ లోకి రాగలిగాడు. ఈ చిత్రం అతని మొదటి 30 కోట్ల షేర్ చిత్రంగా ముగిసింది. ప్రతి ఒక్కరూ సాయి ధరం తేజ్ ను లెక్కలో నుండి తీసివెయ్యడం ప్రారంభించిన సమయంలో సినిమా విజయం వచ్చింది. దీనితో ఈ హిట్ సరైన సమయంలో వచ్చిందనే చెప్పుకోవాలి.
అతను ఇప్పుడు తన విజయపరంపరను విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నాడు. లాక్ డౌన్ సడలించిన తరువాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాలన్స్ షూటింగ్ పూర్తి చేసి… దేవ కట్ట సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అవకాశం ఉంటే ఈ ఏడాదే ఆ సినిమా కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నాడు. అయితే కరోనా కారణంగా అది కుదురుతుందో లేదో చూడాలి.





