ప్రిన్స్ ను వాడేస్తోన్న మెగా కాంపౌండ్!

Sai DharamTej Sitara Song Launched By Mahesh Babuటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును మెగా కాంపౌండ్ ఇటీవల కాలంలో బాగా వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. ‘ధృవ’ సినిమా విడుదల తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి విదేశీ టూర్ కు చెక్కేసిన రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల జరిగిన మహేష్ సతేమని నమ్రత శిర్కోదర్ పుట్టినరోజు నాడు కూడా చెర్రీ హాజరై షాక్ ఇచ్చాడు.

ADVERTISEMENT

అయితే ఈ సారి ప్రిన్స్ సేవలు వినియోగించుకునే వంతు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది. తన తాజా చిత్రం “విన్నర్” మొదటి పాటను ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘సితార’ పేరుతో సాగిన ఈ పాట, ప్రిన్స్ గారాలపట్టి సితార పేరుతో ఉండడం మరో విశేషం. ‘విన్నర్’ చిత్ర యూనిట్ కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ విడుదల చేసిన ఈ ‘సితార’ పాటకు థమన్ సంగీతం అందించాడు.

ADVERTISEMENT
Latest Stories