చంద్రబాబుకు కీలక సమయంలో దెబ్బేసిన వైఎస్ సన్నిహితుడు

Sai Prathap Annayyagari resignation from TDPకేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన సాయి ప్రతాప్.. కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్ అనూహ్యంగా టీడీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన ఇమడలేకపోతున్నారు అనే మాట తరచూ వినిపిస్తుంది. దానికి తోడు ఆయన పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది కూడా లేదు.

తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో 2014 తరువాత అనూహ్యంగా బలపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న జిల్లాలోని 10 స్థానాలలో నాలుగు గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. జిల్లాలోని జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, రైల్వేకోడూరు గెలుస్తామని వారు అంటున్నారు. రాజంపేట ఎంపీ స్థానం కూడా టీడీపీ గట్టి పోటీనే ఇవ్వబోతుంది. దీనితో అలెర్టు ఐన జగన్ సాయి ప్రతాప్ వద్దకు కేవీపీని పంపి నాన్న సెంటిమెంటు వాడారని సమాచారం.

ADVERTISEMENT

సాయి ప్రతాప్ కు అక్కడ సొంత వర్గం ఉండటంతో ఆయన అవసరం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఇవాళ టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అయితే తెలుగుదేశం నాయకులు సాయి ప్రతాప్ పార్టీలో ఎప్పుడూ కలవలేదని ఆయన వల్ల పార్టీకి ఎటువంటి లాభం లేదని ఇప్పటివరకూ, దీనితో ఆయన వెళ్ళిపోయినా పెద్దగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే సాయి ప్రతాప్ చేరికతో వైకాపాలో ఉత్సాహం పెల్లుబిక్కింది.

ADVERTISEMENT
Latest Stories