ఇడుపు కాయితం అనౌన్స్మెంట్ మరియు టైటిల్ రివీల్ టైంలో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. ఎవడో ఒకడు వేసిన ట్వీట్ వల్ల ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా మరియు మీడియా ఛానల్స్ లో యుద్ధ వాతావరణం నెలకొనింది.
ఏకంగా తెలుగు అసలు ఆంధ్రుల భాష కాదు అనే స్థాయికి స్టేట్మెంట్లు పాస్ చేశారు. కట్ చేస్తే.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమా అనౌన్స్మెంట్ తో తెలుగు వెర్సస్ కాస్తా.. తెలుగు వర్సెస్ తమిళంగా రూపాంతరం చెంది ఇడుపు కాయితం ఇష్యూ సైడ్ లైన్ అయ్యింది.
అయితే.. “ఇడుపు కాయితం” టైటిల్ విషయంలో జరిగిన రచ్చ గురించి హీరోయిన్ నాగదుర్గను ప్రశ్నించగా.. “దయచేసి ఇప్పుడు నన్ను ఇడుపు కాయితం కాంట్రవర్సీ గురించి ఏమీ అడగకండి, నేనేం చెప్పలేను” అని దాటవేసింది. ఆల్రెడీ నిర్మాత బన్నీ వాసు ఈ విషయమై రెస్పాండ్ అయ్యారు కూడా. మరి నాగదుర్గ ఎందుకు ఎవాయిడ్ చేసింది?
ఇకపోతే.. తెలుగు కంటే ముందు తమిళంలో ఆమె నటించిన “లవ్ ఓహ్ లవ్” జూలై 10న విడుదలకానుంది. ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన ఈ సినిమా “లెనిన్”తోపాటుగా తెలుగులో రిలీజ్ అవుతుండడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.




