‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో దొరికిన తెలుగు హీరో!

sai rohit, drunk and drive, hyderabad police,  jubilee hills, police case on young hero, tollywoodసినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వర్ధమాన నటులు ఎవరో ఒకరు ఎప్పుడూ ఏదొక వివాదాలతో నిలుస్తూ తెలుగు సినీ పరిశ్రమను వార్తల్లో నిలుపుతున్నారు. తాజాగా ఈ బాధ్యతను మరో వర్ధమాన హీరో సాయి రోహిత్ అందిపుచ్చుకున్నాడు. ‘కాయ్ రాజా కాయ్’ సినిమాతో హీరోగా మారిన సాయి రోహిత్ శనివారం నాడు పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలలో పట్టుబడ్డాడు.

జుబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా… మద్యం తాగి వాహనం నడుపుతుండగా సాయి రోహిత్ ను పట్టుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 13 మంది వాహనాలను సీజ్ చేసారు పోలీసులు. ప్రతి వారాంతం హైదరాబాద్ లో పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories