తమిళంలో రచ్చాసన్ సినిమా సూపర్ హిట్టైంది. విమర్శకుల దగ్గరి నుంచి ప్రశంసలు పొందిన సినిమా అది. క్షణక్షణం ఉత్కంఠతను కలిగిస్తుంది. అక్కడ సూపర్ హిట్టైన ఈ మూవీని తెలుగులో రాక్షసుడు పేరుతో బెల్లంకొండ హీరోగా రూపొందించారు. రమేష్ వర్మ దర్శకుడు. ఈ మూవీ ఆగష్టు 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో హిట్టైన సినిమా కావడంతో క్యూరియాసిటీ ఉంది. పైగా సినిమాకు థ్రిల్లింగ్ కథ కావడం ప్లస్ పాయింట్ అవ్వొచ్చు.
ఫిలిం నగర్ వర్గాల ప్రకారం సినిమా బానే వచ్చిందట. ఒరిజినల్ సినిమాను మక్కీకి మక్కీ దించేశారని సమాచారం. చిత్రం సెకండ్ హాఫ్ మరీ ముఖ్యంగా క్లైమాక్స్ బాగా వచ్చిందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ భారీ సినిమాలు చేస్తున్న బాక్సాఫీస్ వద్ద సరైన విజయం దక్కడం లేదు. ఈ క్రమంలో ఆయన ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించగలడా అనే అనుమానం ఉంది. ఒకవేళ సినిమాకు మంచి టాక్ వచ్చి ప్రేక్షకులు సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం బెల్లంకొండ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయట.
ఆగష్టు 2న ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించిన గుణ 369 కూడా విడుదల కాబోతుంది. బోయపాటి శిష్యుడు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఆర్ఎక్స్ 100 తో సెన్సేషన్ హిప్పీతో డిజాస్టర్ రెండూ టేస్ట్ చేసిన కార్తికేయకు దీని సక్సెస్ చాలా అవసరం. బెల్లంకొండ పరిస్థితి కూడా ఇదే కావడంతో ఈ వారంతంలో ఇద్దరిలో ఎవరి రాత బావుంటుంది అనేది చూడాలి. రెండు సినిమాలలో రాక్షసుడుకే ఎంతో కొంత ప్రేక్షకులలో హైప్ ఉంది.



