ఐష్ ను కొట్టిన మాట అవాస్తవం… కానీ..!

Salman Khan reveals about beating aishwarya raiమాజీ ప్రేమికులైన సల్మాన్ ఖాన్ – ఐశ్వర్యారాయ్ ల మధ్య విభేదాలు అప్పట్లో తారాస్థాయికి చేరుకున్నాయని, దీంతో సల్మాన్ ఖాన్ పలుమార్లు ఐష్ పై చేయి చేసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై సైలెంట్ గా ఉన్న సల్మాన్, తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. 2002లో ఐశ్వర్యారాయ్ – తన మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు, ఆమెను పలుమార్లు కొట్టినట్టు తనపై ఆరోపణలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలేనని, ఐశ్వర్యను తానెప్పుడూ కొట్టలేదని స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT

ఐష్ పై చేయి చేసుకోలేదు గానీ, ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ ని మాత్రం లాగి పెట్టి కొట్టానని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు సల్మాన్. “తాళ్” చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు సుభాష్ ఘాయ్ పై మాత్రం తాను చేయి చేసుకున్నానని, అందుకు అప్పటి పరిస్థితులే కారణమని ఈ కండల వీరుడు చెప్పాడు. సహజంగా తనను ఎవరైనా ఇబ్బంది పెడితే, తనకు తానే గాయపరచుకుంటాను తప్పా, మరొకరిపై ఎప్పుడూ చేయి చేసుకోనని చెప్పాడు.

కానీ, సుభాష్ ఘాయ్ ను అలా ఎందుకు కొట్టాల్సి వచ్చిదంటే.. తన షూస్ పై ఆయన మూత్ర విసర్జన చేశాడని, తనను స్పూన్ తో కొట్టాడని, ఆయన చేతిలో ఉన్న ప్లేటుతో తన ముఖంపై కొట్టాడని, మెడపట్టి నెట్టాడని, ఇటువంటి పరిస్థితుల్లో నియంత్రణ కోల్పోయిన తాను ఆయనపై చేయి చేసుకోవాల్సి వచ్చిందని సల్మాన్ వివరించాడు. అయితే ఆ మర్నాడు స్వయంగా వెళ్లి ఆయనకు సారీ చెప్పానంటూ నాటి సంఘటనలను నెమరువేసుకున్నాడు ఈ కండల వీరుడు.

ADVERTISEMENT
Latest Stories