ఒక్క పోస్టర్ తో పిచ్చెక్కిస్తున్న నెంబర్ “1” స్టార్!

salman khan sultan first look posterఇండియాలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దే హవా! ఎలాంటి సినిమా విడుదల చేసిన ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో పోటీ లేకుండా సల్మాన్ ప్రయాణం సాగిపోతోంది. “వాంటెడ్” సినిమాతో మొదలైన సల్మాన్ విజయపరంపర మొన్నటి “భజరంగీ భాయిజాన్” వరకు నిరంతరంగా సాగింది. అయితే ఇటీవల విడుదలైన “ప్రేమ రతన్ ధన్ పాయో” సినిమా ఆశించిన విధంగా ఆకట్టుకోనప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలయ్యాయి. దీంతో సల్మాన్ రేంజ్ ఏమిటో మరోసారి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు తెలిసి వచ్చింది.

సల్మాన్ తాజాగా నటిస్తున్న చిత్రం “సుల్తాన్.” ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ గా ప్రజాదరణ పొందిన “సుల్తాన్” టైటిల్ తో ప్రస్తుతం సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను గతేడాది జూన్ లో విడుదల చేసినప్పటికీ, అందులో సల్మాన్ లుక్ ను చూపించలేదు. దీంతో “సుల్తాన్”లో కండల వీరుడు ఏ విధంగా దర్శనమివనున్నాడనే ఆసక్తి అభిమాన వర్గంలో నెలకొని వుంది.

ADVERTISEMENT

దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “కండల వీరుడు” అన్న పదానికి నిర్వచనంలా కనపడుతున్న సల్మాన్ పోస్టర్ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. రెజ్లర్ పాత్రలో కనపడనున్న సల్మాన్, దానికి పూర్తి న్యాయం చేసినట్లుగా అర్థమవుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ కు జతగా అనుష్క శర్మ నటిస్తోంది. 2016 ఈద్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ “సుల్తాన్.”

ADVERTISEMENT
Latest Stories