నా ఫోటో చూసి నేనే ఆశ్చర్యపోయా!

Samantha Akkineni Serious faceనాగచైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న గోవాలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో ప్రత్యేక విందు ఏర్పాటు, అక్కినేని-దగ్గుబాటి కుటుంబాలు సరదాగా చేసుకున్న పార్టీలు, మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్ తెలిసిందే. ఈ వేడుకకు సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా సమంత పోస్ట్ చేయడం విదితమే. ఆ ఫోటోలన్నింటిలో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్న సమంత, ఓ ఫొటోలో మాత్రం ‘స్మైల్ లెస్ ఫేస్’తో ఉంది. ఆ ఫోటోను సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి తనదైన శైలిలో తన గురించి కామెంట్ చేసుకుంది.

‘నా ముఖంలో చిరునవ్వు లేకుండా ప్లాస్టర్ వేసుకున్న ఉన్న ఫోటో ఇదీ… ఆశ్చర్యపోయా!!’ అని ఆ పోస్ట్ లో సమంత పేర్కొంది. ఇందుకు సంబంధించి ఫోటోలను పోస్ట్ చేస్తూ… ‘వెడ్డింగ్ సీన్ పూర్తయింది. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. ఈ అందమైన దుస్తులు ధరించి చాలా ఎంజాయ్ చేశా’ అని సమంత తన అనుభూతులను పంచుకుంది.

ADVERTISEMENT
Latest Stories