విడాకుల నుంచి విజయం వరకు ఒంటరి పోరాటాలే

Samantha and Raj Nidimoru’s Wedding: A New Beginning

సినీ ప్రముఖులు పెళ్ళి చేసుకున్నా విడాకులు తీసుకున్నా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ఎందుకంటే వారు సెలబ్రిటీలు కనుక. అయితే హీరోలు విడాకులు తీసుకుంటే అభిమానులు చాలా విశాల హృదయాలతో సర్దుకుపోగలరు కానీ హీరోయిన్లను మాత్రం అంత త్వరగా క్షమించలేరు.

నాగ చైతన్య, సమంత పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. అప్పుడు అభిమానులు నాగ చైతన్య కోసం బాధ పడ్డారు, సమంతపై కోప్పడ్డారు. అంటే వారు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియకపోయినా తప్పు ఆమెదే అని నిర్ధారించేశారన్న మాట! ఆ తర్వాత నాగ చైతన్య అంగరంగ వైభవంగా శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వేణుస్వామి తప్ప అందరూ నిండు మనసులతో వారిని ఆశీర్వదించారు.

ADVERTISEMENT

నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలో ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. అయినా కష్టపడి సినిమాలు చేస్తే అన్నీ ఫ్లాప్ అయ్యాయి. పైగా సోషల్ మీడియాలో విమర్శలు, అవహేళనలు తప్పలేదు.

ఏక కాలంలో వచ్చిన ఈ ఒత్తిళ్లన్నిటినీ ఒంటరిగా ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ సమంత చాలా ధైర్యంగా వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడటమే కాదు, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌ పుణ్యమా అని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

ఆ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలోనే ఆమె జీవితంలోకి ఫ్యామిలీ మ్యాన్-2… అదే… దర్శకుడు రాజ్ నిడిమోరు వచ్చారు. ఆయన ఇది వరకే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. వారిరువురి జీవితాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కనుక కనెక్ట్ అయ్యారు.

వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించారు. కానీ సోషల్ మీడియా ఆమోదం లభించలేదు! కనుక ఎప్పటిలాగే విమర్శలు, అవహేళనలు వచ్చాయి. వారి ప్రేమను ఆయన మాజీ భార్య అంగీకరించకపోతే అది చాలా సహజం. కానీ సమాజానికి అభ్యంతరం దేనికో అర్థం కాదు.

ఏది ఏమైనప్పటికీ, ఇద్దరూ మొన్న డిసెంబర్‌ 1న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ జీవితాలను మళ్లీ గాడిన పెట్టుకున్నారు. కనుక ఇకపై ట్రా లాల…. అంటూ హాయిగా సాగిపోవాలని కోరుకుందాం. సినీ పరిశ్రమలో ఇలాంటి పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణమే. మరి ఇదంతా ఎందుకు వ్రాయాల్సి వచ్చిందంటే, సమంత జీవితంలో ఒంటరి పోరాటం చేసి గెలిచినందునే!

ADVERTISEMENT
Latest Stories