హైదరాబాద్ బిర్యానీ నుంచి తన పెళ్లి రిసెప్షన్ వరకు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ‘కుందనపు బొమ్మ’ సమంత నవ్వుతూ సమాధానమిచ్చింది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమంతను మీడియా చుట్టుముట్టి… ‘హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పండి..’ అని అడుగగా, ‘కొత్తగా ఏం చెప్పాలి. మటన్ కీమా బాగుంటుంది’ అంటూ బదులిచ్చింది.
తెలుగులో కొత్త చిత్రాలను తాను ఇంకా ఒప్పుకోలేదని, త్వరలోనే చేస్తానని, తమిళంలో మాత్రం మూడు చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ చిత్రాల రిలీజ్ కోసం చూస్తున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. చైతన్యతో తన పెళ్లి గురించి ప్రశ్నించగా… ‘ఆ… పెళ్లి గురించా… నా పెళ్లి రిసెప్షన్ ఇక్కడే జరుగుతుంది… అందరూ ఇన్ వైటెడ్… ఓకేనా…’ అని చిరునవ్వులు చిందిస్తూ సమంత సమాధానమిచ్చింది ‘జెస్సీ.’
ADVERTISEMENT
ADVERTISEMENT



