సమంత నన్ను లాగి చెంప మీద కొట్టినట్లయింది!

Rangasthalam---How-Can-Sukumar-Answer-Him“రంగస్థలం”లో చిట్టిబాబుగా రామ్ చరణ్ ఎంత బాగా నటించాడో, రామలక్ష్మిగా కనిపించిన సమంత కూడా అంతే అద్భుతంగా అభినయించిన విషయం తెలిసిందే. అయితే రామలక్ష్మి పాత్రకు ముందుగా సమంతను ఎంపిక చేయడం తనకు ఇష్టం లేదని దర్శకుడు సుకుమార్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణంగా తాను డైలాగ్స్ ను సెట్స్ లో ఉండగానే రాస్తుంటాను గనుక, ఇద్దరు స్టార్స్ ను తాను హ్యాండిల్ చేయలేమోనన్న భావన తనలో ఉందని, అయితే ఇద్దరూ ‘డౌన్ టు ఎర్త్’తో తన భావన తప్పని నిరూపించారని పేర్కొన్నారు.

ముందుగా కాదనుకున్న సమంత అయితే, తన నటనతో, తన ప్రవర్తనతో నా చెంప మీద లాగి పెట్టి కొట్టినట్లయ్యిందని, అందుకే ఆడియో ఫంక్షన్ లో సమంతకు ఎంత వయసు వస్తే ఆ తరహా పాత్రలు సృష్టించడానికి తాను సిద్ధమని చెప్పానని తెలిపారు సుకుమార్. ఇక లిప్ లాక్ విషయమై స్పందిస్తూ… 80లలో ఉన్న పల్లెటూర్లలో ఇలాంటి ఎమోషన్ సాధారణమని, అలాంటి ఎమోషనల్ సీన్ పండితేనే, తర్వాత సీన్ మరింతగా రంజింప చేస్తుందని ‘నాన్ బాహుబలి’ రికార్డులను సృష్టించిన సుకుమార్ తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories