ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సిన ఫోటో!

Samantha ruth prabhu kissing naga chaitanya on foreheadప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనేక ఫోటోలు, వీడియోలు హల్చల్ చేసాయి. ఎంతమంది సందడి చేసినా నెటిజన్లకు ఏదో లోటు అయితే స్పష్టంగా కనపడింది. ఆ లోటు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో సంచలన ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జంట చైతూ – సమంతలకు సంబంధించి, వాలైంటైన్స్ డే నాడు ఎలాంటి ఫోటో గానీ, వీడియో గానీ రాకపోవడమే ఈ వెలితికి కారణం.

ADVERTISEMENT

అయితే ప్రేమ ముచ్చట్లు చెప్పుకునే పనిలో ఉన్న ఈ జంట ఫోటో ఒకటి కాస్త లేటుగా సోషల్ మీడియాకు ఎక్కింది. ఆలస్యం అయితే ఏముంది… ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చే విధంగా ఈ ఫోటో ఉంది. నాగచైతన్యను తన చేతులతో దగ్గరికి తీసుకుని, ప్రేమతో నుదురుపై ఓ ముద్దు ఇస్తున్న సమంత ఫోటో చూడముచ్చటగా ఉంది. పరిపక్వత కలిగిన ఆదర్శమైన ‘ప్రేమ జంట’ అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా చైతూ – శ్యామ్ లు సందడి చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories