పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోవాల్సిన విషయం తెలిసిందే. అయితే ఇది చేతులు మారి, చివరికి బాబీని వరించడం, ఆ తర్వాత ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడం జరిగిపోయిన సంగతులే. అయినా పవన్ రెడీ అంటే తాను ఇప్పటికీ ఓ సినిమా చేయడానికి సిద్ధమని సంపత్ నంది ఇటీవల కూడా ప్రకటించారు. అయితే పవర్ స్టార్ కున్న సినీ, రాజకీయ షెడ్యూల్స్ రీత్యా అది సాధ్యం కాకపోవచ్చన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బహుశా పవన్ మిస్సయ్యారు కాబట్టి, ఆయన అభిమానిని డైరెక్ట్తో చేసి, ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్నారేమో గానీ, పవర్ స్టార్ కు వీరాభిమాని అయిన హీరో నితిన్ తో ఓ సినిమా చేయడానికి సంపత్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కార్యరూపం సిద్ధించుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్నది ట్రేడ్ టాక్. ‘లై’ సినిమాతో డీలాపడ్డ నితిన్ ను లేపడానికి, కమర్షియల్ సినిమాలను అందించడంలో సిద్దహస్తుడిగా పేరు గాంచిన సంపత్ నందినే కరెక్ట్ అంటున్నారు సినీ వర్గాలు కూడా!


