‘ఆండ్రాయిడు’ హీరో ఫస్ట్ లుక్ టాక్!

sampoornesh babu as androiduఒకప్పుడు అల్లరి నరేష్ టైటిల్స్ తోనే గిలిగింతలు పెట్టేవాడు. అయితే ఇపుడు సినిమాలతో కూడా ఆ పని చేయలేక పోతున్నాడు, అది వేరే విషయంలేండి..! అయితే టైటిల్స్ తో చక్కిలిగింతలు పెట్టే బాధ్యతను బహుశా ‘బర్నింగ్ స్టార్’ తీసుకున్నట్లుగా కనపడుతోంది. ‘హృదయ కాలేయం’ అంటూ ఓ వైరైటీ టైటిల్ తో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

తాజాగా ఈ హీరో ‘ఆండ్రాయిడు’ అనే కొత్త పేరుకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో విడుదల చేసాడు సంపూ. కరిజ్మా బైక్ పై సంపూ ఉన్న స్టిల్ ‘బర్నింగ్ స్టార్’ మార్క్ ను చూపించింది. త్వరలోనే “కొబ్బరిమట్ట, ఆండ్రాయిడు” ద్వారా మీ ముందుకు వస్తాను… ఆశీర్వదించండి… అంటూ కోరిన సంపూ స్టిల్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories