మెగాస్టార్ మెగా మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడనే టాక్ ఊపందుకుంది. ఇటీవల సంపూ నటించిన ‘కొబ్బరిమట్ట’ టీజర్ వీక్షించిన చిరు, ఆ టీజర్లో బర్నింగ్ స్టార్ డైలాగ్స్ కు ఫిదా కావడంతో, సంపూకు ఈ అవకాశం వరించిందని సినీ వర్గాల సమాచారం.
ముందుగా ఈ రోల్ కోసం సునీల్, వెన్నెల కిషోర్ లను సంప్రదించగా, తేదీలు అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ స్థానంలో అలీని తీసుకున్నారని తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి ఫస్ట్ షాట్ లో నటించింది కూడా అలీనే. అయితే అలీ కాకుండా మరో కమెడియన్ గా సంపూ రంగప్రవేశం చేస్తున్నారా? లేక సంపూ వార్త కేవలం సినీ జనాల పుకారేనా అన్నది తెలియాల్సి ఉంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



