అరవింద్ స్వామి, శ్రియ శరణ్, సందీప్ కిషన్, ఆథ్మిక, ఇంద్రజిత్ సుకుమారన్ నటించిన తమిళ థ్రిల్లర్, నరగసూరన్ 2017 లో షూటింగ్ ప్రారంభించింది. సినిమా షూటింగ్ కేవలం 41 రోజుల్లో పూర్తయింది, కానీ వివిధ కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ మూవీని ఇటీవల మార్చి 27 న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేశారు.
కరోనావైరస్ లాక్డౌన్ మరియు ఇతర కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీనితో ఇక థియేటర్లలో విడుదల చెయ్యడం సాధ్యం కాదని అనుకున్నారో ఏమో దీనిని ప్రత్యక్ష డిజిటల్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17 నుండి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.
ప్రత్యక్ష డిజిటల్ విడుదల చేసిన తొలి తెలుగు హీరోగా సందీప్ కిషన్ కాబోతున్నారు నరగసూరన్ ను తమిళ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సినిమాకు నిర్మాత కూడా. సందీప్ కిషన్ ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాడు అయితే అక్కడ ఇంకా ఈ హీరోకు బ్రేక్ దక్కలేదు.
ఈ సినిమా వల్ల అది జరిగే అవకాశాలు లేకపోయినా సినిమా బావుండి సందీప్ కిషన్ కి మంచి పేరైన వస్తుందేమో చూడాలి. ఈ యువ నటుడు తెలుగులో ప్రస్తుతం ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే తమిళంలో కసడ తపర అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.





