ఫ్యామిలీ పందెం కోళ్లు…

Sankranti 2026 Telugu family movies competing at the box office

ఈ సంక్రాంతికి వెండితెర మీదకు వచ్చిన, రానున్న అన్ని సినిమాలు అనూహ్యంగా ఫ్యామిలీ మూవీస్ కావడంతో ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ముందుగా ఈ సంక్రాంతి బరిలో జనవరి – 9 న రాజాసాబ్ అంటూ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ వెండితెర పందెం కోళ్ల బరిలో కి దిగారు.

హర్రర్ అండ్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ రాజాసాబ్ కామెడీతో భయపెట్టింది, హర్రర్ తో నవ్వించిందనే చెప్పాలి. ఇక ఆ తరువాత మరో ఫ్యామిలీ మూవీగా జాన్ – 12 న వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ వింటేజ్ చిరుని మెగా అభిమానులకు పరిచయం చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

ADVERTISEMENT

సంక్రాంతికి వస్తున్నాం అంటూ 2024 లో వెంకీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఈ ఏడాది చిరుతో తిరిగి సంక్రాంతి పందెం కోళ్ల బరిలోకి దూకారు, అలాగే తన సంక్రాంతి ఆనవాయితీని కొనసాగిస్తూ మరో సీనియర్ హీరో తో మరో సంక్రాంతి విజయాన్ని అందుకున్నారు.

ఇక వరుస యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న మాస్ హీరో రవితేజ కూడా ఈసారి తన జోనర్ ని పక్కన పెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటి ఫ్యామిలీ స్టోరీలోకి అడుగుపెట్టారు. ఈ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రవి తేజ BMV కూడా పాజిటివ్ టాక్ ని రాబట్టుకుంది.

దీనితో ఇప్పటికే అటు చిరు ఇటు రవితేజ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఇక జాన్ -14 భోగి పండుగ రోజు రానున్న శర్వా నారి నారి నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా బరిలోకి దిగనున్నాయి.

దీనితో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఒకే జోనర్ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ టార్గెట్ గా ఏకంగా 5 సినిమాలు వెండితెర మీద ప్రత్యక్షం అవుతున్నాయి. ఇప్పటికే మూడు రిలీజ్ కాగా మరో రెండు రేపు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి.

ఇందులో శర్వా కు సంక్రాంతి ట్రాక్ రికార్డ్ పాజిటివ్ గా ఉండడంతో ఈసారి కూడా శర్వా తన ఆనవాయితీని కొనసాగిస్తూ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారా.? అంటూ శర్వా మూవీ పై ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. అలాగే నవీన్ అనగనగ ఒక రాజు పై కూడా అదే ఆసక్తి కనపరుస్తున్నారు ఆడియన్స్. మరి ఈ ఫ్యామిలీ పందెం కోళ్ళల్లో ఎక్కువగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆ పందెం కోడి ఎవరు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది..!

ADVERTISEMENT
Latest Stories