ట్రైలర్ టాక్ – గ్రాండ్ ఎంట్రీలా ఉంది!

Saptagiri Express theatrical trailer కమెడియన్లు హీరోలుగా మారడం సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా ద్వారా మరో కమెడియన్ హీరోగా రూపాంతరం చెందాడు. ఈ సినిమా ఆడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల కావడంతో, కావలసినంత పబ్లిసిటీ దక్కింది. అలాగే ఇదే వేడుకపై విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’తో సప్తగిరి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంకేతాలను స్పష్టం చేసింది.

ముందుగా ఈ ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన విషయాలు… చిన్న సినిమా అయినా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లుక్ ను తీసుకురావడంలో సక్సెస్ సాధించారు. ఇక, ఇప్పటివరకు కామెడీ వేషాలు వేసిన సప్తగిరిని ఫుల్ లెంగ్త్ రోల్ లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం గానీ, ఓ ఫక్తు కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న విషయాన్ని ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

అయితే ప్రేక్షకులు ఆశించే సప్తగిరి కామెడీ టైమింగ్ మచ్చుకు కూడా ఈ ట్రైలర్ లో కనిపించకపోవడం, సినీ ప్రేక్షకులను, సప్తగిరి కామెడీని అమితంగా ఇష్టపడే ప్రియులను నిరాశపరుస్తోంది. సప్తగిరి తర్వాత చెప్పుకోవాలంటే… షకలక శంకర్ డైలాగ్స్ కాస్త వినోదాన్ని పంచాయి. హీరోయిన్ కూడా పెద్ద మైనస్ కాగా, సంగీతం ప్లస్ పాయింట్స్ లో ఉంది. అయితే పోసాని, షాయాజీ షిండే వంటి ప్రముఖ నటులతో ఈ చిన్న సినిమా వెండితెరపై వెలుగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories