భార్య పేరు కూడా పలకడానికి కూడా ఇష్టం లేదన్న నటుడు!

Sarath Babu about his wifeపోలీస్ ఆఫీసర్ కావాలని కలలు గన్న తానూ చివరకు సినీ నటుడిని అయ్యానని శరత్ బాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చెరగని మద్ర వేసిన శరత్ బాబు, 1973లో హీరోగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. సినిమాలతో పాటు, సీరియల్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న శరత్ బాబు, ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

ADVERTISEMENT

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలతో పాటు ‘వేకింగ్ డ్రీమ్స్’ అనే ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు. ఇలా సినీ రంగంలో ఎంతో సాధించిన శరత్ బాబు వైవాహిక జీవితం మాత్రం విచ్ఛిన్నమైంది. తన భార్య పేరును ఉచ్ఛరించడానికి కూడా తాను ఇష్టపడనని, తన భార్య పేరు మిసెస్ శరత్ కుమార్ మాత్రమే అని చెప్పారు. జీవితంలో చోటు చేసుకునే ఎన్నో సంఘటనల్లో పెళ్లి కూడా ఒక సంఘటనే అని, కొన్ని సంఘటనలు జీవిత కాలం ఉంటాయి… కొన్ని మాత్రం కాలగర్భంలో కలసిపోతుంటాయి అని చెప్పారు.

జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని, మీకు ఎంత మంది పిల్లలు అని చాలా మంది తనను అడుగుతుంటారని… తనకు పాతిక మంది పిల్లలు అని చెబుతుంటానని శరత్ బాబు అన్నారు. “అవును నిజమే. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలందరూ కలిపి పాతిక మంది ఉంటారు. వారంతా కూడా నా పిల్లలే కదా” అని శరత్ బాబు చెప్పారు. తాను పూర్తిగా శాకాహారమే తీసుకుంటానని… మన ఆకలిని తీర్చుకోవడానికి మరో ప్రాణిని చంపే హక్కు మనకు లేదని అన్నారు శరత్ బాబు.

ADVERTISEMENT
Latest Stories