పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో “అత్తారింటికి దారేది” సినిమా మినహా, హిట్టయిన సినిమాలన్నీ సమ్మర్ లో వచ్చి సెన్సేషన్ సృష్టించినవే. విద్యార్ధులకు సెలవు దినాలు కావడంతో, తనకు ఎక్కువగా ఉండే యూత్ అభిమానుల నుండి మంచి ఆదరణ లభిస్తుందనే అంచనానో ఏమో గానీ, పవన్ నటించిన ఎక్కువ శాతం సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేసినవే. తాజాగా మరోసారి అదే సెంటిమెంట్ ను ఫాలో అయిపోతున్నారు పవన్.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న “సర్ధార్ గబ్బర్ సింగ్”ను వేసవి సెలవుల కానుకగా మే 11వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. తొలుత సంక్రాంతి అని డిసైడ్ అవ్వగా, అది కాస్త మార్చి నెలాఖరుకు వాయిదా వేసారు. అయితే తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారంతో ఆ తేదీ ఇంకాస్త వెనక్కి జరిగింది. మార్చి, ఏప్రిల్ మాసాలలో వివిధ పరీక్షలు జరుగుతాయనే కారణంగా మే నెలకు మార్చారని తెలుస్తోంది.
పవన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ కూడా 2012 మే 11వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించడంతో, అదే సెంటిమెంట్ ను అనుసరించి, అదే తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ ఆకాంక్ష నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది కాలం వేచిచూడాల్సిందే. అయితే విడుదల తేదీ గురించి హల్చల్ చేస్తున్న వార్త పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఆనందదాయకమైనది.





