పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు సంబంధించి తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. “హ్యాపీ సంక్రాంతి” చెబుతూ ఉన్న పోస్టర్ లో అభిమానుల మతి పోగొడుతోంది. డప్పు పట్టుకుని లేడీ ఉన్న భంగిమ మరియు పవర్ స్టార్ వేస్తున్న స్టెప్ తో కూడిన పోస్టర్ మాస్ వర్గాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రాబోతున్న తొలి సినిమా టీజర్ ను ‘భోగి’ పండుగ సందర్భంగా 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. మంగళవారం నాడు విడుదల చేసిన పోస్టర్ తో ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేసిన పవన్ అభిమానులు మరోసారి అలాంటి ప్రక్రియకే శ్రీకారం చుట్టబోతున్నారు.
ADVERTISEMENT





