కొత్త ఏడాదికి పవన్ ఫ్యాన్స్ ఓ విషయం తెలుసుకున్నారు!

sardar gabbar singh not releasing for sankranthiఘట్టమనేని, నందమూరి అభిమానులంతా వారి వారి అభిమాన హీరోల టీజర్లు, పోస్టర్లతో కొత్త ఏడాదిని జరుపుకుంటుంటే మెగా అభిమానులు మాత్రం నీరసించిపోయారు. “సర్ధార్ గబ్బర్ సింగ్” టీజర్ తో ఒక ఊపు ఊపుదామని భావించిన పవన్ ఫ్యాన్స్ కు, పవర్ స్టార్ అలాంటి అవకాశాన్ని కలిగించలేదు. దీంతో నిరుత్సాహంలో ఉన్న పవన్ అభిమానుల కోసం “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను అందించారు.

జనవరి 4వ తేదీ నుండి హైదరాబాద్ లో మొదలు కానున్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ 70% పూర్తవుతుందట. మార్చి నాటికి షూటింగ్ మొత్తం ముగుంచుకుని, ఏప్రిల్ లో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియోను, మే 11న బాబీ దర్శకత్వం వహించిన సినిమాను విడుదల చేయడానికి నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ అభిమానులకు సంబంధించినంత వరకు “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ సమాచారమే కొత్త సంవత్సరం కానుకగా భావించాలి.

ADVERTISEMENT

తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం సంక్రాంతికి “సర్ధార్ గబ్బర్ సింగ్” టీజర్ విడుదల చేస్తారని తెలుసుకున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇటీవల అనుభవాల దృష్య్టా ఎటువంటి అంచనాలు, నమ్మకాలు పెట్టుకోకపోవడమే మంచిదని సినీ విశ్లేషకులు భావన.

ADVERTISEMENT
Latest Stories