వర్మను ఏడిపించిన ‘మెగాస్టార్’

Sarkar 3 Interview - Ram Gopal Varma Amitabh Bachchanతాను ఏ ర‌క‌మైన భావోద్వేగాలూ లేని వ్య‌క్తిన‌ని, అయితే బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, సిల్వర్ స్క్రీన్ ‘మెగాస్టార్’ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చ‌దివి క‌న్నీరు పెట్టుకున్నాన‌ని సంచలన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో వెల్లడించారు. సర్కార్‌ సిరీస్‌ లో భాగంగా ‘సర్కార్‌-3’ త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘాయ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ ను ఇంటర్వ్యూ చేశారు.

“రాంగోపాల్ వర్మ చేసే సినిమాలన్నీ స్థిరత్వంగా ఉండవని, అటువంటి దర్శకుడితో కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయాలేంటి?” అన్న ప్రశ్నకు అమితాబ్‌ సమాధానమిస్తూ… స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే కానీ, ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్ష‌కుల‌కి బోర్‌ కొట్టిస్తాయని చెప్పారు. ఉదాహ‌ర‌ణ‌కు నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులో ఉన్న అందాన్ని ఎలా గుర్తించగలుగుతారని, అలా ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారు.

ADVERTISEMENT

అలాగే రాంగోపాల్‌ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వమ‌ని, ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వ‌ర్మ అని ప్ర‌శంసించారు. త‌న‌లో కూడా అలాంటి కోణాన్ని చూడాలనుకోవడం త‌న‌ అదృష్టమ‌ని, వర్మ అస్థిరత్వం వల్ల అతను అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ, ఓ కళాకారుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్థిరంగా బాక్సాఫీస్‌ సక్సెస్‌ అందుకుంటున్నాడని చెప్పారు. బిగ్ బీకి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని అనుకుంటున్న‌ట్లుగా వర్మ పేర్కొన్నాడు.

ADVERTISEMENT
Latest Stories