‘బ్రహ్మోత్సవం’ రికార్డులను బద్దలు కొట్టిన ‘సరైనోడు’

Sarrainodu-TRP-Ratings beats mahesh babu brahmostavamగతేడాది సమ్మర్ లో విడుదలై, టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైన దారుణ పరాజయాన్ని చవిచూసిన ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమా, బుల్లితెరపైన కూడా అదే స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. సహజంగా మహేష్ సినిమాలకు బుల్లితెరపై విపరీతమైన ఆదరణ ఉండడంతో, ‘బ్రహ్మోత్సవం’కు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ ట్రేడ్ వర్గీయులను షాక్ కు గురిచేశాయి. అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఆ స్కోప్ ఉందన్న సమాచారంతో, ఆ సినిమా చూసిన వారెవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

అయితే గతేడాది అదే సమ్మర్ లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ “సరైనోడు” సినిమా ఇటీవల బుల్లితెరపై ప్రదర్శితం కాగా, ఈ సినిమాకు కూడా అవాక్కయ్యే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. సహజంగా బ్లాక్ బస్టర్ సినిమాలకు 15 నుండి 20 మధ్య రేటింగ్స్ వస్తుంటాయి. కానీ, బన్నీ “సరైనోడు” విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా “బ్రహ్మోత్సవం” కంటే దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుని, సరికొత్త రికార్డును సృష్టించడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT

పెద్ద హీరోల సినిమాలలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా మొదటి స్థానంలో ‘సరైనోడు’ చరిత్ర సృష్టించగా, రెండవ స్థానంలో ‘బ్రహ్మోత్సవం’ నిలిచింది. మరో విశేషమేమిటంటే… ‘సరైనోడు’కు దక్కిన రేటింగ్స్ ‘బిచ్చగాడు, సోగ్గాడే చిన్నినాయనా’ రెండవ సారి ప్రదర్శించిన రేటింగ్స్ తో దాదాపుగా సరిసమానంగా ఉండడం. అలాగే విడుదలైన ఒక నెల లోపునే బుల్లితెరపై ప్రదర్శించిన “పిట్టగోడ” సినిమాకు కూడా కేవలం 2.85 రేటింగ్స్ ను మాత్రమే దక్కించుకుంది.

ADVERTISEMENT
Latest Stories