నివ్వెరపరుస్తున్న శశికళ ఆస్తుల చిట్టా!

Sasikala Natarajan assetsఐటీ అధికారుల సోదాల్లో కళ్లు చెదిరిపోయే రీతిలో శశికళ మరియు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులు బయటపడుతున్నాయి. మొత్తం 187 స్థానాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా, ఈ సోదాల్లో ఇప్పటి వరకు 4,500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అలాగే 80 నకిలీ కంపెనీలను కూడా గుర్తించారు. ఈ నకిలీ కంపెనీల పేరుతో 1800 ఎకరాల భూమిని వీరు కొనుగోలు చేశారు.

ADVERTISEMENT

పెద్ద నోట్ల రద్దు సమయంలో 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో శశికళ మరియు ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. మరోవైపు పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరింత కీలక సమాచారం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సోదాల్లో బయటపడుతున్న ఆస్తులను చూసి అధికారులు నివ్వెరపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories