చిన్న మమ్మీ ఆన్ ది వే – మరింత రంజుగా తమిళ రాజకీయాలు?

Sasikala Natarajan - Bail Parol Tamil Nadu Politicsఅస్వస్థతతో ఉన్న భర్త నటరాజన్ ను చూసేందుకు 15 రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని శశికళ కోర్టును కోరారు. నటరాజన్ చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లివర్, కిడ్నీ వైఫల్యంతో లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారు. వైద్యలు ఆయనకు డయాలసిస్, ఇంటెన్సివ్ కేర్ థెరపీ చికిత్స అందిస్తున్నారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. శశికళకు పెరోల్ వస్తే తమిళ్ నాడు రాయకీయాలు మరింత రంజుగా మారనున్నాయి. శశికళ బయటకి వచ్చి ఆపరేషన్ ఎలిమినేట్ పన్నీర్‌సెల్వం – పళనిస్వామి సర్కార్‌ మొదలు పెడితే తమిళ రాజకీయాలు మరింత రంజుగా మారతాయి.

ADVERTISEMENT

మరో వైపు పళనిసామిని నిందిస్తూ తయారు చేసిన కరపత్రాలను పంచారన్న అబియోగంపై దినకరన్ మీద ఏకంగా దేశ ద్రోహం కేసు నమోదు అయింది. ఆయనతో పాటు మరో పదిహేను మందిపై కూడా కేసులు పెట్టారు. పళనిసామిని, కేంద్రాన్ని దూషిస్తూ ఆ పత్రాలలో వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories