మళ్ళీ ఊపేస్తాడా?

Naga-Chaitanya-Denies-Working-with-That-Lady-Directorచందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీస్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం నాగ్ హిట్ సాంగ్స్ లో ఒకటి రీమిక్స్ చేయనున్నట్టు సమాచారం. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘అల్లరి అల్లుడు’ ఒకటి. 1993లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాయితు’ అనే సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది.

ADVERTISEMENT

కీరవాణి స్వరపరచిన ఈ పాటను .. ‘సవ్యసాచి’ కోసం రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా కీరవాణి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఈ రీమిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారట. ఈ సారి కూడా కీరవాణి ఒక ఊపు ఊపుతారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories