‘రహస్యం’ అనగానే ‘హీరోయిన్’ పేరు చెప్పేసారు!

Shahid Kapoor on Kareena Kapoor Khanప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొనగా… ఈ సందర్భంగా ఓ అభిమాని షాహిద్ ను రహస్యంగా ఉన్న మీ గతం గురించి చెప్పాలని కోరింది. దీనికి స్పందించిన షాహిద్ కపూర్… ‘నాకో రహస్యం ఉందా? ఈ విషయం మీకెలా తెలుసు? నామీదేమైనా నిఘా పెట్టారా? అయినా మీరు రహస్యమన్నారు కదా? దానిని నేను బయటపెట్టను’ అని చమత్కారంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ADVERTISEMENT

దీంతో వెనుక వరుస నుంచి ‘కరీనా కపూర్’ అని గట్టిగా అభిమానులు అరవడంతో ‘ఓహ్ అదా.. .అందులో సీక్రెట్ ఏముంది? అందరికీ తెలిసిందే కదా? అది బహిరంగ రహస్యం’ అనడంతో అంతా నవ్వేశారు. కాగా, గతంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగిన విషయం, వీరిద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కెమెరాలలో దొరికిన విషయం, అలాగే వీరిద్దరూ కలిసి వివాహం చేసుకుంటారని మీడియాలో వచ్చిన కథనాలు అంతా బహిరంగమే.

ADVERTISEMENT
Latest Stories