రణబీర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మలు నటించిన “ఏ దిల్ హై ముష్కిల్” సినిమాకు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఐష్ – రణబీర్ ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలే హైలైట్ గా విడుదల అవుతోన్న ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చే విషయం ఒకటి బయటకు వచ్చింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘సూపర్ స్టార్’ షారుక్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేసారన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోంది.
అంతేకాదు, దీనికి సంబంధించిన స్నాప్ షాట్స్ ను కూడా తీసి మరీ ‘కింగ్ ఖాన్’ అతిథి పాత్రను ఖరారు చేస్తున్నారు. దీంతో “ఏ దిల్ హై ముష్కిల్”కు మరింత హైప్ వచ్చినట్లయ్యింది. కరణ్ జోహార్ కు, షారుక్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరణ్ సినిమాలో ఖచ్చితంగా షారుక్ ఉంటాడనే ప్రచారం బలంగా జరిగినప్పటికీ, విడుదల ముందు రోజు వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి, అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. మరి ఇంకెన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.


