టీజర్ టాక్ – దేవుడికే దెయ్యం పట్టిస్తే..!

Sharabha Movie Teaser Talkమెగాస్టార్ చిరంజీవి ఏంటి… “శరభ” అనే ఓ సాధారణ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఏంటి..? అనుకున్న వారికి సమాధానం చెప్పేలా “శరభ” సినిమా ఫస్ట్ టీజర్ ఉంది. ‘దేవుడు – దెయ్యం’ ఈ సబ్జెక్ట్ తో ఏ సినిమా తీసినా ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి ఆసక్తినే కలిగించడంలో “శరభ” టీజర్ సక్సెస్ సాధించింది. ఇంతవరకు ఎవరికీ తెలియని ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయడం చేయడమనేది మినహాయిస్తే… ఈ టీజర్ లో పెద్దగా విమర్శించాల్సిన అంశాలేవీ లేవు.

ADVERTISEMENT

‘దేవుడికే దెయ్యం పట్టిస్తే…’ అంటూ టీజర్ మధ్యలో వచ్చే డైలాగ్ తో మరింత ఆసక్తిని రేపిన ఈ సినిమాకు కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది. నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కాస్టింగ్ లో జయప్రద, నెపోలియన్, ఎల్బీశ్రీరాం వంటి ప్రముఖులు కనువిందు చేయనున్నారు. చిన్న సినిమా అయినా క్వాలిటీలో ఎక్కడా రాజీపడలేదన్న విషయం టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఇలాంటి సినిమాలను టీజర్లో బాగానే కట్ చేస్తున్నారు గానీ, సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం మెప్పించలేకపోతున్నారు.

మరి “శరభ” ఏం చేస్తుందో… రాబోయే రోజుల్లో తేలనుంది గానీ, అప్పటివరకు ఈ టీజర్ పై లుక్కేయండి..!

ADVERTISEMENT
Latest Stories