ఏపీ కాంగ్రెస్ షర్మిల సొంతమా.?

Sharmila’s One-Woman Show in Andhra Pradesh Congress

రాష్ట్ర విభజనతో ఏపీ రాజకీయాలలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, టి. వైసీపీ పార్టీతో తెలంగాణ రాజకీయాలలో విలీనం తో చేతులు కాల్చుకున్న వైస్ షర్మిల ఇద్దరు వైసీపీ ఓటమి కోసం, జగన్ పతనం కోసం చేతులు కలిపారు.

నాడు ఒక్కటైనా చేతులు నేడు విడివిడిగా మారాయా అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వరకు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ బతికి ఉంటే చాలు అందుకు నాయకత్వం ఎవరు వహించిన మాకు సమ్మతమే అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంటే,

ADVERTISEMENT

పార్టీ ఎవరిదైనా సరే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తన చేతిలో ఉంటే చాలు అన్నట్టుగా షర్మిల వ్యవహరిస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహిస్తున్నారు అంటే రాష్ట్ర రాజకీయాలలో ఆమె వేసే ప్రతి అడుగు పై జాతీయ స్థాయి అధిష్టానం కన్ను ఉంటుంది.

కానీ ఏపీలో అందుకు భిన్నంగా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి జాతీయ స్థాయి అధిష్టానానికి మధ్య ఎటువంటి రాజకీయ ఆదేశాలు కనిపించడం లేదు, అలాగే పార్టీ బలోపెట్టనికి సంబంధించి ఎంటువంటి చర్యలు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ అయినట్టుగా షర్మిల వ్యవహార శైలి కనిపిస్తుంది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కలుపుకెళ్ళడంలో విఫలమైన షర్మిల కనీసం పార్టీకి కొత్త రాజకీయ రక్తాన్ని కూడా అందించలేకపోతున్నారు. తెలంగాణలో టి. వైసీపీ అంటూ తనకు నచ్చిన, తనను మెచ్చిన నలుగురిని వెంటేసుకుని రాజకీయ చేసి చేతులు కాల్చుకున్న షర్మిల ఇప్పుడు కూడా అదే ధోరణిలో ముందుకెళ్తున్నారు.

కాంగ్రెస్ అంటే షర్మిల, షర్మిల అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ తరుపున షర్మిల ‘వన్ ఉమన్ షో’ చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ తో తన ఇన్నాళ్ల ప్రయాణంలో షర్మిల ఇప్పటి వరకు పార్టీ తరుపున ఒక్క నాయకుడిని కూడా ప్రజలకు పరిచయం చెయ్యలేకపోయింది. అధిష్టానానికి అందించలేకపోయింది.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే షర్మిల కూడా తన అన్న జగన్ మాదిరే మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకోలేరా.? వైఎస్ వృక్షం కింద మరో కొత్త తరం నాయకత్వం బతికి బట్ట కట్టలేదా.? వైఎస్ వారసులు పార్టీ అధినేతలుగా ఉంటే ఇక ఆ పార్టీకి మరో నాయకుడు అనే పేరే వినిపించదా.? కనిపించదా.?

అయితే కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినప్పటికీ ఏపీలో మాత్రం అది షర్మిల వ్యక్తిగత పార్టీగానే మనుగడ సాగించడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీతో తానూ నడుస్తూనే తన కొడుకు వైస్ రాజారెడ్డి ని సైతం నడిపించాలని భావిస్తున్నారా.?

ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మొన్న కర్నూల్ పర్యటనలో భాగంగా షర్మిల తనతో పాటుగా తన కొడుకు రాజారెడ్డి ని సైతం వెంటబెట్టుకొచ్చారు. అలాగే అవసరం వచ్చినప్పుడు రాజారెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అంటూ తన రాజకీయ వారసుడిగా రాజారెడ్డిని ప్రకటించారు.

అయితే ఇదంతా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన తరువాతనే ప్రకటన చేసారా.? లేక ప్రజలతో పాటే పార్టీ అధిష్టానానికి కూడా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ మీద ముందస్తు సమాచారం అందించారా.? ఏదిఏమైనా షర్మిల ఏపీ కాంగ్రెస్ ను తన కనుసన్నలలో నడిపిస్తుంది అనేదే ముమ్మాటికీ వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories