సక్సెస్ లో ఉన్నపుడు ఏం చేసినా బానే ఉంటుంది. అలాంటి సక్సెస్ లనే వరుసగా అందుకుంటున్న యువహీరో శర్వానంద్, తాజాగా “రాధ” సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి యూ ట్యూబ్ లో విడుదల చేస్తుండగా, నేడు రెండవ పాటను రిలీజ్ చేసారు. ‘ఖాకీ చొక్కా’ అనే తొలి పాటతో మాస్ ను టార్గెట్ చేసిన శర్వా, ‘చూపుల్తో’ అనే రెండవ పాటతో క్లాస్ కు చేరువయ్యే ప్రయత్నం చేసారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెనుక పడుతూ సాగే ఈ పాటను రంజిత్ ఆలపించాడు. కేకే అందించిన సాహిత్యం వినసొంపుగా ఉండగా, రాడాన్ మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇటీవల కాలంలో సినిమాలు హిట్ అవుతున్నాయేమో గానీ, ఆడియో ఆల్బమ్స్ మాత్రం సంగీత ప్రియులకు సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. కానీ, ‘రాధ’ సినిమా పాటలు మాత్రం, ఉన్నంతలో కాస్త పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయన్న సంకేతాలను తొలి రెండు పాటలు అందించాయి.



