Sharwanand Maha Samudram Movieలాక్ డౌన్ తరువాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలు షూటింగ్ మొదలుపెట్టేశాయి. ఇంకా కొందరు హీరోలు మాత్రం ఇంకా షూటింగ్ మొదలు పెట్టడానికి సంశయిస్తున్నారు. అయితే యువ హీరో శర్వానంద్ మాత్రం సూపర్ స్పీడ్ గా ఉన్నాడు. లాక్ డౌన్ తరువాత అతను ఇప్పటికే రెండు సినిమాల షూటింగులలో పాల్గొన్నాడు.

శ్రీకారం… ఇంకో తెలుగు-తమిళం బైలింగ్వల్ సినిమాలకు షూట్ చేశాడు. ఇప్పుడు తాజాగా అతని కొత్త చిత్రం… మహా సముద్రం కూడా తెరకెక్కుతోందని సమాచారం. వచ్చే నెలలోనే గోవాలో షూటింగ్ మొదలుపెడతారని అంటున్నారు. దానితో లాక్ డౌన్ తరువాత శర్వానంద్ మూడు సినిమాల షూటింగులలో పాల్గొన్న ఏకైక హీరో అవుతాడు.

తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన అజ‌య్ భూప‌తి, మ‌రోసారి ఆడియెన్స్‌ను అబ్బుర‌పరిచే ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశాడట. ఇంటెన్స్ ల‌వ్‌-యాక్ష‌న్ డ్రామాగా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని సుంక‌ర అనిల్ తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.

ఈ ఏడాదిలో టాలీవుడ్ లో వచ్చిన అతికొద్ది హిట్స్ లో సరిలేరు నీకెవ్వరూ ఒకటి. దాని నిర్మాతలలో అనిల్ సుంకర ఒకరు. అను ఇమ్మానుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లు. హీరో సిద్ధార్థ్‌ 8 ఏళ్ల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తవుతున్నాయి.