స్టార్ హీరోయిన్ ప్రేమ… చివాట్లు పెట్టిన స్టార్ హీరో..!

Shruti Haasan Dating Rumor - Kamal Haasanతన కుమార్తె శృతిహాసన్‌ ప్రేమ విషయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంతకాలంగా లండన్‌ కు చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌ తో శృతిహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు బాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో విపరీతంగా హల్చల్ చేసిన సమాచారం. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా లండన్‌ లో కలుసుకున్న వీరిద్దరూ మూడు నెలలుగా ప్రేమలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే శృతి బాలీవుడ్‌ లో ‘బెహెన్‌ హోగీ తేరీ’ అనే ఆల్బమ్‌ లో నటిస్తుండగా, ప్రియురాలిని చూసేందుకు మైఖేల్‌ లండన్‌ నుంచి ముంబై వచ్చాడని ఇటీవల ఫోటోలతో కూడిన సమాచారం హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో కమల్ కూతురిపై మండిపడినట్టు, వీరి ప్రేమ విషయంలో రోజుకో పుకారు పుట్టుకొస్తుందని, అది తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని ఆందోళన చెందుతున్నాడని కోలీవుడ్ పేర్కొంటోంది. ఈ ప్రేమ వ్యవహారంలో కూతురికి కమల్ గట్టిగానే క్లాస్ పీకాడని టాక్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories