ఈ సారి కోలీవుడ్ లో కలకలం రేపిన ఘటన!

Singer Suchitra Karthik tweets  attack by Dhanush and simbuమలయాళ సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిన భావన ఘటన మరువక ముందే, కోలీవుడ్ లో ఓ ఘటన కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా టాప్ హీరోలపై ప్రముఖ గాయని ఆరోపణలు చేయడంతో, ఈ విషయం హెడ్ లైన్స్ కు ఎక్కింది. తమిళ యువ హీరోలు శింబు, ధనుష్ లు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారంటూ టాప్ సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

ADVERTISEMENT

అయితే సుచిత్ర ట్విట్టర్ లో ఎవరో పొరపాటున ఈ పోస్ట్ చేశారనే ప్రచారం జరింది. కానీ వెంటనే తన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసిన సుచిత్ర… తాను ట్విట్లర్లోకి మళ్లీ వచ్చానని, ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంతేకాదు, ఇది ముమ్మాటికీ నిజమని తేల్చి చెప్పింది. ఈ జాబితాలో నువ్వు కూడా ఉన్నావంటూ శింబును ఉద్దేశించి తెలిపింది. ధనుష్ టీమ్ రఫ్ హ్యాండ్లింగ్ వల్ల గాయపడ్డ తన చేతి ఫోటోను పోస్ట్ చేసింది సుచిత్ర.

ADVERTISEMENT
Latest Stories