భ్రమలను బద్దలు కొట్టే బాధ్యత మహేష్ తనయదే

Sitara Ghattamaneniస్టార్ కిడ్స్ అంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయో అంతే మోతాదులో ఇబ్బందులు కూడా వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. మహేష్ బాబు గారాల పట్టి సితార ఒక జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం, దాని కోసం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జర్నలిస్టుతో సంభాషించడం అరుదైన పరిణామం. తనను పబ్లిక్ లోకి తీసుకురావడానికి మహేష్, నమ్రతల పరిణితి కూడిన ఆలోచనని మెచ్చుకోవచ్చు.

ఈ సందర్భంగానే తాను భవిష్యత్తులో సినిమాల్లో నటించడానికి సిద్ధమని సితార చెప్పడం బాగుంది. ఎలాంటి పాత్రలు, ఎవరు హీరో లాంటి ఆలోచనలు ఇప్పుడప్పుడే అవసరం లేదు కానీ సితారకు ఓ అయిదారేళ్ళ తర్వాతైనా కొన్ని సవాళ్ళను దాటుకుని లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలం ఎంత మారినా స్టార్ల పట్ల అభిమానుల ఆరాధనా భావంలో ఎలాంటి మార్పు ఉండదు.

ADVERTISEMENT

ఇది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నించింది. బాలకృష్ణతో ఎస్వి కృష్ణారెడ్డి తీసిన టాప్ హీరోతో పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఘట్టమనేని ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అబ్బాయిలు రావొచ్చు కానీ అమ్మాయిలు వద్దని వాళ్ళు కోరుకోవడంతో కృష్ణ వెనుకడుగు వేయక తప్పలేదు. తర్వాత చిన్న సినిమాలతో మంజుల తన ఆకాంక్ష కొంత వరకే నెరవేర్చుకోగలిగారు.

చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, వెంకటేష్ వీళ్ళెవరూ కూతుళ్లను టాలీవుడ్ కు లాంచ్ చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్, యుట్యూబర్ ఇలా వేర్వేరు బాధ్యతలు తీసుకున్నారు తప్ప నటిగా రాలేదు. కమల్ హాసన్ ఒక్కరే దీనికి ఎదురీది శృతి, అక్షరలకు తగినంత స్వేచ్ఛ ఇచ్చారు. బాలీవుడ్ లో ఇది చాలా సహజం. కానీ దక్షిణాదిలో మాత్రం ఇదంత సులభంగా ఉండదు.

సితార తెరంగేట్రం నాటికి పరిస్థితుల్లో కొంత మార్పు ఉండొచ్చు కానీ పూర్తిగా అయితే కాదు. అప్పుడు తను ఎంచుకునే సబ్జెక్టులు, నటించే హీరోలు, కాంబినేషన్లు, బ్యానర్లు ఇలా ఎన్నెన్నో విషయాల్లో ప్లాన్డ్ గా ఉండాలి. తల్లితండ్రులు ఇవన్నీ దగ్గరుండి చూసుకున్నా సవాళ్ల మధ్య ప్రయాణం ఆషామాషీగా ఉండబోదు. పైగా పెర్ఫార్మన్స్ మాత్రమే డిమాండ్ చేసే కథలు ఆ టైంకి అసలుంటాయో లేదో. స్వంత బ్యానర్ అయితే సమస్య లేదు. నిజంగా సితార రావడం స్వాగతించే విషయమే కానీ సవాళ్ల మధ్య ప్రయాణమైతే ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories