ఒకానొక టైమ్‌లో న్యూస్ చానళ్లు పుట్టగొడుగుళ్ల పుట్టుకొచ్చాయి తెలుగులో. దాదాపుగా ఒక ఇరవై చానళ్లు ఉన్నాయి ఇప్పుడు తెలుగు వారి ముంగిట. ఐతే వీటిలో బాగా పాపులర్ ఐనవి వెళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. మిగత చానల్లు అన్ని అరకొర రేటింగ్‌ల తో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఈ చానళ్లు పైకి రావాలంటే ఏదో ఒక డిఫరెంట్ కన్సెప్ట్ ఉండాల్సిందే. కాబట్టి ఈ చానళ్ల చూపు అమరావతి వైపు ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర కి సరైన ఛానల్ లేదు. కాబట్టి టెలికాస్ట్ ఫ్రమ్ అమరావతి అనిపించుకోవాలని ఆరాట పడుతున్నాయి.
వీటిలో కొన్ని ఆంధ్ర లో చోటు కోసం ప్రభుత్వ పెద్దలకు ఆర్జీ పెట్టాయి కూడా. మహా న్యూస్ ఈ మధ్యనే అమరావతి కి పయనం అయ్యింది. అలానే మహా న్యూస్ బాటలోనే మరిన్ని ఛానల్లు అమరావతి వైపు చూస్తున్నాయి. ఆంధ్ర నుండి ఆంధ్ర కోసం ఆంధ్ర వార్తలు అనే నినాదం తో సరికొత్తగా ముస్తాబు అవుతున్నాయి. ఐతే ఆంధ్ర జనాలు వీటిలో ఏ ఛానల్ ను ఆదరిస్తారో చూడాలి మరి.


