సోషల్ మీడియాలో కేసీఆర్ పై ప్రశంసల జల్లు

Social media praises cm kcrనిన్న హైదరాబాద్ లో జరిగిన రైతు సమన్వయ సమితులు ప్రాంతీయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతుండగా ఒక రైతు బోరున విలపించడం కనిపించింది. ఆయన ఒక దశలో మాటలాడటం ఆపేసి ఆ రైతుని ఏమిటి విషయం అని అడిగారు.

ఏడుస్తావా నువ్వు మగాడివి….చెప్పు నీకు ఏంకావాలి అని ఆ రైతును అడిగారు. ఆయన రోదిస్తూ తన కూతురు విదేశాలలో ఎంబీబీస్ చదవడానికి స్కాలర్ షిప్ రావట్లేదని, రూల్స్ లో ఎంబీబీస్ కు స్కాలర్ షిప్ లేదని చెప్పుకొచ్చారు. నేను ఇప్పుడే సాంక్షన్ చేస్తా రాయి వచ్చి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలువు అన్నారు.

ADVERTISEMENT

వెంటనే ఆ రైతు అక్కడికక్కడే చేతులు జోడించి సీఎంకు మొక్కాడు. పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావును ఆ సంగతి చూడమని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్యని చిటికిలో పరిష్కరించిన సీఎంని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ADVERTISEMENT
Latest Stories