బాలకృష్ణ గారు …కాస్త ఆలోచించండి సార్!

social media trolls on nandamuri balakrishna behaniourనట సింహం నందమూరి బాలకృష్ణ ..సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆయన మంచి వాళ్లకు మంచి వాడు..చెడ్డ వాళ్లకు..చండ శాసనుడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు…బాలయ్యతో పని చేసిన వారికి…ఆయనతో ప్రయాణం చేసిన వారికి తప్పా ఆయన గురించి ఏమి తెలీదు…ఆ తొడ గొడితే ట్రైన్ సీన్… ట్రైన్ పై పల్సర్ తొలి సీన్ తప్ప.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఆయన్ని ట్రోల్ చేసే విషయంలో కొందరి అభిమాన వర్గాలు అదే పనిలో ఉంటాయి. వారి హీరోలపై అభిమానంతో బాలయ్యని ట్రోల్ చెయ్యడం తప్పే అయినా …అయన కూడా కాస్త మారాలి అని అనిపిస్తుంది కొన్ని సార్లు ఎందుకంటే…ఆయన చిన్న పిల్లాడిలా నటిస్తే…చూసే వారికి కాస్త ఎబ్బెట్టు గానే ఉంటుంది..అయన మాట్లాడే విధానాన్ని ఆయన అభిమానులే కొన్ని సార్లు విమర్శించుకుంటూ ఉంటారు. ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిదేమో అని..

అయితే ఇక్కడ మనం పూర్తిగా విమర్శించే వారినే కాదు..కాస్త బాలయ్యను కూడా ఖచ్చితంగా మారమని చెప్పాల్సిందే ఎందుకంటే ఆయన ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా ఇంకా కొంటె పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటే…వాటినే ట్రోల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు కొందరి అభిమానులు..

మరి బాలయ్య గారు వారిని దృష్టిలో పెట్టుకుని కొంచెం పెద్దరికం ప్రదర్శిస్తే మంచిదేమో అన్నది ఆయన అభిమానుల అభిలాష…అయితే ఎవరి మ్యానరిజం వారిదే అనుకోండి….కాకపోతే అవతల వాడికి దొరికే అవకాశం ఇవ్వవద్దు అన్నది బాలయ్య ఫాన్స్ ఆలోచన..

మరి బాలయ్య అటు వైపుగా కాస్తైనా ఆలోచిస్తారేమో…చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories