ఫ్రెష్ వీక్… జగన్ ఫ్రెష్ కిక్… ఫ్రెష్ ట్రోల్స్..!

social media trolls on ys jagan languageవారాంతంలో వచ్చే కిక్ ప్రారంభ రోజుగా పరిగణించే సోమవారం నాటికి సహజంగా ఉండదు. కానీ తెలుగుదేశం వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దానికి కారణం… సీఎం జగన్ మోహన్ రెడ్డి గారే! కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఊర్ల పేర్లు చదువుతూ సీఎం పలికిన భాషను టీడీపీ నెట్టింట పెట్టింది.

జగన్ రెడ్డి తెలుగు భాషా పాండిత్యం తెలియనిది కాదు. అలాగని వాటిని టీడీపీ వర్గీయులు ట్రోల్ చేయడం కూడా కొత్త కాదు. అయితే తాజా తాజాగా ఎప్పటికప్పుడు నెటిజన్లకు అవకాశాలు అందిస్తోన్న జగన్ రెడ్డి, ఈ వారం ప్రారంభంలో “రాజమహేంద్ర వర్మ” రూపంలో మరో ‘జ్ఞానగుళిక’ను అందించారని నెట్టింట టీడీపీ ట్రోల్ చేస్తోంది.

ADVERTISEMENT

ఊర్ల పేర్లు చదువుతూ ఉన్న జగన్, రాజమహేంద్ర వరం అని చదవడానికి బదులుగా రాజమహేంద్ర వర్మ అని పలికారు. సాధారణంగా ప్రసంగాలలో తడబాటుకు గురికావడం ఈ మూడేళ్ళుగా చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఊరు పేరును కూడా సరిగా పలకలేకపోవడంతో, టీడీపీ నాటి లోకేష్ విషయాలను గుర్తుకు చేస్తూ చెలరేగిపోతోంది.

అప్పట్లో ‘మంగళగిరి’కి బదులు ‘మందలగిరి’ అని పలికిన లోకేష్ ను వైసీపీ కూడా ఇదే స్థాయిలో ట్రోల్ చేసింది. దీంతో ఇపుడు టీడీపీ వంతు వచ్చినట్లుంది. ఇక నుండి ‘రాజమహేంద్ర వరం’ అంటే నెటిజన్లు మాత్రం ‘రాజమహేంద్ర వర్మ’ అని మాత్రమే అనే విధంగా సోషల్ మీడియాలో జగన్ రెడ్డి వాయిస్ వినపడుతోంది.

ఒక్క రాజమహేంద్ర వరం విషయంలోనే కాదు, గుంటూరుకి ‘గుండూరు’ అని, హిందూపురాన్ని ‘సింధుపురం’ అని, విశాఖని ‘ఉషాక’ అని, టెక్కలిని ‘టెక్కిలి’ అని, నవులూరుని ‘నలుగులూరు’ అని జగన్ వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులు హైలైట్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఒకానొక సమయంలో జగన్ చెప్పిన మాట ఏమిటంటే… ‘కొట్టారు తీసుకున్నాం, మాకు టైం వస్తది, మేము కొడతాం’ అంటూ సినీ ఫక్కీలో డైలాగ్స్ చెప్పిన వైనం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇవే డైలాగ్స్ ను తెలుగు తమ్ముళ్లు ‘వైసీపీ అండ్ కో’కు అప్పచెప్పే పనిలో ఉన్నారు. ఇదే కదా జగన్ చెప్పే ‘దేవుడి లీల!’

ADVERTISEMENT
Latest Stories