సోమిరెడ్డి చాలా సాహసమే చేస్తున్నారు… ప్రాణం పదిలం సుమా!

Somireddy Chandramohan Reddy

ఈ ఏడాది మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరిగినప్పుడు, “ఏపీలో సహజవనరులు, అవకాశాలు అపారం,” అంటూ వైసీపి ప్రభుత్వం చేసిన ప్రచారం బహుశః ప్రజలు, పెట్టుబడిదారులు కూడా మరిచిపోయి ఉండవచ్చు. కానీ వైసీపి నేతలు ఎవరూ మరిచిపోలేదు.

రాష్ట్రంలో సహజవనరులైన మైకా, సిలికాన్, గ్రానైట్, చివరికి ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు వంటివి కూడా యాధేచ్చగా తవ్వేసుకొంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్ళీ అధికారంలోకి వస్తామోరామోననే ముందుచూపుతో ఈ సహజవనరుల దోపిడీని వేగవంతం చేశారు.

ADVERTISEMENT

నెల్లూరు జిల్లా పొదలకూరులో భారత్‌ మైకామైన్స్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతోంది. అక్కడ చాలా స్వచ్చమైన, చాలా విలువైన మైకా లభిస్తుంది. దానిని ఓ స్థానిక వైసీపి నేత యధేచ్చగా తవ్వి తరలించుకుపోతున్నాడు. ఈ విషయం తెలిసి టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచే సంబందిత అధికారులకు ఫోన్లు చేసి అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ రాలేదు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తాడిపర్తి, వరదాయపాలెం, పొదలకూరు గ్రామస్తులు కూడా అక్కడ ధర్నా చేశారు. కానీ వారు ధర్నా చేస్తుంటే వారి కళ్లెదుటే మైకా రాళ్ళను బస్తాలలో మూటలు కట్టుకొని లారీలలో తరలించడానికి ప్రయత్నించగా వారు ఆ లారీలను అడ్డుకొని పోలీసులకు ఫోన్ చేశారు. కానీ సాయంత్రం వరకు ఎదురుచూసినా ఎవరూ రాలేదు.

దాంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా అందరూ రాత్రంతా ఆ గనుల వద్ద చీకటి, చలిలో అక్కడే కూర్చొని లారీలను కదలనీయకుండా అడ్డుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అక్కడకు చేరుకొని వారి దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపి నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా రాష్ట్రంలో సహజ సంపదను కోళ్ళ గొడుతున్నారు. వారికి పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారు. అయితే మరో మూడు నెలల తర్వాత టిడిపి, జనసేనల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకొని తిన్న ఈ వైసీపి నేతలందరి చేత వాటిని కక్కిస్తాము. అలాగే వారి దోపిడీకి సహకరిస్తున్న అధికారుల ఉద్యోగాలు ఊడగొట్టి, వారిపై కేసులు నమోదు చేయించి చట్టప్రకారం శిక్షిస్తాము,” అని హెచ్చరించారు.

ఇటువంటి నిర్జన ప్రదేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్ది మంది గ్రామస్తులతో కలిసి రాత్రిపూట దీక్ష కొనసాగించడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కరలేదు. వైసీపి నేతల దోపిడీని అడ్డుకొనేందుకు చేస్తున్న ఇటువంటి సాహసాలు ఆయన ప్రాణానికే ప్రమాదం కూడా. వివేకానే లేపేసినవారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ లెక్కా? కనుక ముందు తనపై దాడులు జరుగకుండా, వాటి వలన ప్రాణాపాయం కలుగకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories