చంద్రబాబు ఎప్పటికైనా మా ట్రాపులోకి రావాల్సిందే: సోము వీర్రాజు

Somu Veerrajuఅల్లుడి ఆతృతే తప్ప..కూతురు కంగారు పడడం లేదన్న సామెతలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వ్యవహారం. పార్టీ ఎదుగుతుందన్న సూచనలు ఉండవు… కానీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఈ వ్యవహారం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకా మరింత పెరిగింది.

రాష్ట్రానికి అంతా మేమే అనడం, పెద్ద పెద్ద నేతలను కలిసి వారు పార్టీలోకి వచ్చేస్తున్నారు అన్నట్టు హడావిడి చెయ్యడం వంటి వాటితో ఏదో రకంగా వార్తల్లో నిలిచే తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా వీర్రాజు.. ఏపీ అభివృద్ధికి ఏం చేశామో చెప్పడానికి మేము సిద్ధం.. మంత్రులు బహిరంగ చర్చకు వస్తే బిజెపి నేతలు కూడా వస్తారుఅంటూ అధికార పార్టీకి సవాలు చేశారు.

ADVERTISEMENT

“బీజేపీ రెండు రకాలుగా విడిపోయింది.. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసే పాత బీజేపీ ఒకటైతే.. చంద్రబాబు మనుషులతో నిండిన కొత్త బీజేపీ మరొకటి, కొత్త బీజేపీ ట్రాప్ లో సోమువీర్రాజు పడొద్దు,” అన్న మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యల పై కూడా ఆయన స్పందించారు.

దీనిపై వీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. “చంద్రబాబు ఎప్పటికైనా మా ట్రాపులోకి రావాల్సిందే.. బీజేపీ కార్యకర్తలు ఎవరూ చంద్రబాబు ట్రాప్ లో పడరు,” అని చెప్పుకొచ్చారు. అయితే చరిత్ర చూస్తే ఎప్పుడు టీడీపీ తో పొత్తు కోసం బీజేపీనే ఎదురెళ్ళింది. సీట్ల కేటాయింపులో టీడీపీనే మేజర్ పార్టనర్. అయితే మాటలు చెప్పడానికి ఏముంది? ఎన్నైనా చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories