సీఎం జగన్ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు

Somu Veerraju - YS Jaganనిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మొండి చెయ్యి ఇచ్చింది కేంద్రం. కనీస కేటాయింపులు కూడా చెయ్యలేదు… విభజన హామీల సంగతి అయితే పూర్తిగా విస్మరించింది కేంద్రం. రాష్ట్రంలో అంతకాదు ఇంతకాదు అంటూ బీరాలు పలికిన రాష్ట్ర బీజేపీ నేతలు దానిగురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు.

ADVERTISEMENT

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బడ్జెట్ కేటాయింపుల గురించి చెప్పలేదు గానీ రాష్ట్రం కమ్మటి బీరు దొరకడం లేదని స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. రాష్ట్రంలో తాగుదాం అంటే కమ్మని బీరు దొరకడం లేదు, సీఎం జగన్ సొంత బ్రాండ్లతో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. మద్యం ప్రియులకు తెలిసిన కింగ్ ఫిషర్ వంటి బ్రాండ్లు రానివ్వకుండా సీఎం సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నారు అని ఆరోపించారు.

అయితే సోషల్ మీడియా లో ఇటువంటి అవకాశం దొరికితే అసలు వదిలిపెట్టారు. సోము వైఖరి పై నెటిజెన్లు పంచ్లు వేస్తున్నారు. “జనం బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమీ రాలేదురా అని ఏడుస్తుంటే వీరు బీరు గురించి భాధపడుతున్నారు”, అంటూ బీజేపీ వారి వైఖరిని ఎండగడుతున్నారు.

అయితే ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపుల మీద ముఖ్యమంత్రే స్పందించలేదు.. ఇక సొంత పార్టీ ప్రభుత్వాన్ని సోము వీర్రాజు విమర్శిస్తారని ఎలా అనుకోగలం? స్పందించకపోతే ప్రజల దగ్గర బాగోదని… ఎంపీ విజయసాయి రెడ్డి తో నామమాత్రంగా స్పందింపచేశారు.

ADVERTISEMENT
Latest Stories