‘తమిళ’ స్టార్ హీరో సరసన ‘బాలీవుడ్’ టాప్ హీరోయిన్?

sonakshi-sinha-ready-to-work-in-south-filmsదక్షిణాది సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తుంటే… బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లు మాత్రం తమకు దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. అవకాశం వస్తే మరోసారి తమిళ సినిమాలో నటిస్తానని ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది. ప్రస్తుతం తన 61వ సినిమాలో నటిస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్, దీని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.

ఇదే విషయం గురించి సోనాక్షిని అడిగితే… విజయ్ తో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకాకుండా మురుగదాస్ సినిమాలో నటించడం తనకు ఎప్పుడూ సంతోషమే అని చెప్పింది. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో హిందీలో అకీరా, హాలిడే సినిమాల్లో నటించానని, అలాగే గతంలో రజనీకాంత్ తో కలసి ‘లింగా’ సినిమాలో నటించానని… ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినప్పటికీ… రజనీ లాంటి గొప్ప వ్యక్తితో పని చేసిన ఆనందాన్ని మిగిల్చిందని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories