బాలసుబ్రహ్మణ్యం మరణంపై రామోజీ రావు మీద నిందలు

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం భౌతికంగా తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. 52 రోజుల పాటు మృత్యువుతో సుధీర్ఘ పోరాటం చేసి, అల‌సిపోయి, ఓడిపోయారు. అయితే ఈ దుర్ఘటనను కూడా కొందరు తమ ఎజెండా కు తగ్గట్టుగా వాడుకుంటున్నారు. బాలుకు ఈటీవీకి సంబంధించిన ఒక ప్రొగ్రాం వ‌ల్లే క‌రోనా సోకింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఒక‌టికి రెండు సార్లు బాలుకు ఫోన్ చేసి ప‌ట్టుబట్ట‌డంతో చెన్నై నుండి బాలు హైద‌రాబాద్ వ‌చ్చి, ఇక్క‌డే మూడు రోజుల పాటు ఉన్నారని…. ఆ షూటింగ్ లో ఉన్న వారిలోనే ఒక‌రికి క‌రోనా నిర్ధార‌ణ అయ్యింద‌ని, అక్క‌డి నుండే వైర‌స్ వ్యాప్తి అయిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీనితో రామోజీ రావుపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు కొందరు.

ADVERTISEMENT

అయితే ఒకరికి కరోనా సోకడం అనేది ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నవారికి కూడా కరోనా సోకడం మనం చూస్తూనే ఉన్నాం. మనలో చాలా మంది మన రోజువారీ పనులు చేసుకుని ఇంటికి క్షేమంగా వస్తున్నాం. కొందరు కరోనా బారిన పడినా కోలుకుంటున్నారు. బాలు విషయంలో జరిగింది దురదృష్టకరం.

రామోజీ రావు బాలు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా బాలుని ఇంటింటికి తీసుకుని వెళ్లారు రామోజీ రావు. బాలు మొదట్లో వద్దని చెప్పినా పట్టువిడవకుండా ఆ కార్యక్రమానికి ఒప్పించారు రామోజీ రావు. వారి బంధాన్ని కూడా ఇలా రాజకీయ అవసరాల గురించి వాడుకోవడం దారుణం.

ADVERTISEMENT
Latest Stories