హవా మొదలైంది… సునామీ సృష్టిస్తాడా..!

SPYder US Advance Bookings బుధవారం నాడు సినీ అభిమానులను పలకరించబోతున్న “స్పైడర్” సినిమా హవా బాక్సాఫీస్ వద్ద మొదలైంది. ఇప్పటివరకు ఎలాంటి పబ్లిసిటీ చేయకపోయినా… విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా… మురుగదాస్ – మహేష్ బాబుల కాంబోపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో… అని చెప్పడానికి నిదర్శనంగా యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ నిలుస్తున్నాయి. ‘ఔరా’ అనిపించే విధంగా ఇంకా ప్రీమియర్స్ కు రెండు రోజుల సమయం ఉండగానే, హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేయడం విశేషం.

ఈ ఫిగర్ ఇక్కడితో ఆగేది అయితే కాదు. రాబోయే రెండు రోజుల్లో పబ్లిసిటీ మరింత పీక్ లో ఉండనుండగా, ప్రస్తుతం రాబట్టిన దానికి రెట్టింపు అయితే పక్కాగా ఫిక్స్ అయ్యున్నారు. అయితే అది ఒక రెట్లా… రెండా… మూడా… అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. నిజంగా ఇలాంటి వీక్ పబ్లిసిటీతో లేక పేలవమైన ట్రైలర్ తో మరో స్టార్ హీరో ఈ రేంజ్ లో రాబడతారో లేదో చెప్పడం కష్టమే గానీ… ప్రిన్స్ మహేష్ బాబుకు యుఎస్ మార్కెట్ లో ఎంత స్టామినా ఉందో ఈ సందర్భంగా మరోసారి బహిర్గతమవుతోంది.

ADVERTISEMENT

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అవలీలగా 1.5 మిలియన్ మార్క్ ను ప్రీమియర్స్ ద్వారా చేరుకుంటుందని భావిస్తున్నారు. అయితే రాబోయే రెండు రోజుల్లో పబ్లిసిటీ ప్రభావం ఏమైనా పడితే… అది 2 మిలియన్ మార్క్ ను చేరుకోవడం పెద్దగా కష్టమైన విషయమైతే కాదు. ప్రీమియర్స్ ద్వారా ఆ మార్క్ ను అందుకుని, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే గనుక, యుఎస్ లో ‘బాహుబలి 1’ రికార్డులకు కాలం చెల్లినట్లేనని ఫిక్స్ అయిపోవచ్చు. నిజానికి ఆ రేంజ్ కు చేరుకుంటే గానీ, ‘స్పైడర్’కు యుఎస్ లో లాభాల బాట పట్టదు.

ADVERTISEMENT
Latest Stories