చెన్నై అంతా… స్పైడర్ మయం..!

Spyder Audio Day Chennai Mahesh Babu1999లో “రాజకుమారుడు”గా టాలీవుడ్ లో అడుగుపెట్టి తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ప్రిన్స్ మహేష్ బాబు, దాదాపుగా 18 ఏళ్ళ తర్వాత కోలీవుడ్ లో తెరంగ్రేటం చేస్తున్నాడు. తమిళ ప్రేక్షకులకు మహేష్ బాబు ఎప్పటినుండో తెలిసినా, స్ట్రెయిట్ మూవీతో “స్పైడర్” ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. విశేషం ఏమిటంటే… తమిళంలో కూడా సొంత డబ్బింగ్ చెప్తుండడంతో, మహేష్ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది తమిళ ప్రేక్షకులకు పూర్తిగా పరిచయం కానుంది. దీంతో కోలీవుడ్ లో ప్రిన్స్ ప్రస్థానం ప్రారంభం కావడానికి “స్పైడర్” వేడుక సిద్ధమవుతోంది.

“స్పైడర్” గనుక ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయితే, తమిళనాట మహేష్ ‘సౌండ్’కు భారీ హీరోలు అవాక్కు అవ్వడం ఖాయం అనిపించే విధంగా చెన్నై నగరమంతా “స్పైడర్” ఫ్లెక్సీల నిండిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే… ఈ వేడుక ఏదైనా తెలుగు రాష్ట్రంలో జరుగుతోందా? లేక పొరుగున ఉన్న తమిళనాడులో జరుగుతోందా? అన్న రీతిలో చెన్నై సిటీ “స్పైడర్” మయం అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుండి ఈ వేడుకలో పాల్గొనడానికి భారీ స్థాయిలో అభిమానులు వెళ్ళిన మాట నిజమే గానీ, వీరంతా చెన్నైలో ఫ్లెక్సీలు మాత్రం ఏర్పాటు చేయలేరన్నది గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT

అంటే చెన్నైలో ప్రిన్స్ అభిమానగణం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి నిదర్శనంగా ఈ వేడుక నిలుస్తోంది. ఇక ఆడియో స్టేజ్ ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. వచ్చిన వారు అబ్బూరపడే విధంగా స్టేజ్ ను ‘వహ్వా’ అనే విధంగా సెట్ చేసారు. బహుశా తెలుగు రాష్ట్రంలో ఈ వేడుక జరిగినా, ఇంత బాగా ఏర్పాట్లు చేసేవారు కాదేమోనన్న టాక్ అభిమానుల నుండే వ్యక్తమవుతోంది. ప్రిన్స్ ను, మురుగదాస్ ను ఆశీర్వదించడానికి ఇద్దరు దక్షిణాది దిగ్గజ దర్శకులు శంకర్ మరియు రాజమౌళిలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. దీంతో ‘స్పైడర్’ ఆడియో విడుదల ఉత్సాహంలో ప్రిన్స్ అభిమానులంతా మునిగి తేలుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories