మహేష్ బాబు ‘సెన్సాఫ్ హ్యూమర్’ గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చాలా విధాలుగా చెప్పిన విషయం తెలిసిందే. ప్రిన్స్ సెన్సార్ హ్యుమర్ గురించి అందరికి తెలియదు గానీ, యాంకర్ సుమ సెన్సాఫ్ హ్యుమర్ గురించి మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా సుమ చేసిన కొన్ని వ్యాఖ్యలకు, ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఎక్స్ ప్రెషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
‘స్పైడర్’ సినిమాకు సింగిల్ కార్డ్ రచయితగా వ్యవహరించిన రామజోగయ్య శాస్త్రి వచ్చిన సమయంలో… ఇలాగే మహేష్ బాబు సినిమాలకు మంచి రచన అందించాలని, రాబోయే కాలంలో గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా మీరు రచయితగా వ్యవహరించాలి, నేను ఇలాగే యాంకర్ గా ఉండాలి… అంటూ సుమ చేసిన వ్యాఖ్యలకు గౌతమ్ కృష్ణ సిగ్గుపడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ‘కెవ్వు కేక’ పెట్టించేలా ఉన్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT


